2:38 PM | Posted by mla mana
సిగరెట్ తాగడంలోనూ, పొగను రింగురింగులుగా గాల్లోకి వదలడంలోనూ రజనీకాంత్ తర్వాత తానేనని ఫీలయ్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. పబ్లిక్ గా పొగత్రాగడం నేరమని తెలిసినా, ఆనం తన పద్దతిని మార్చుకోలేదు. పైపెచ్చు.. సిగరెట్ తాగుతూ మీడియాకు ఫోజులు కూడా ఇస్తుంటారు. అలాగే అసెంబ్లీ ఆవరణలో కూడా ఇవాళ సిగరెట్ తాగుతూ సీఎం కంటపడ్డారు ఆనం వివేకానంద. అంతే.. దగ్గరకు వచ్చిన సీఎం.. ఇంకెప్పుడూ ఇలా పబ్లిక్ లో సిగరెట్ తాగకని సుతిమెత్తగా హెచ్చరించి వెళ్లిపోయారు. మరి ఆనం సిగరెట్ మానేస్తారా..!