7:01 PM | Posted by mla mana

ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తులు ఈ మధ్య తరచూ మారిపోతున్నారు. చైనాకు చెందిన పింగ్ పాంగ్.. కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ హెర్నాండెజ్.. ఆ తర్వాత నేపాల్ కు చెందిన ఖగేంద్ర.. వరసగా ప్రపంచంలోనే షార్టెస్ట్ పర్సన్స్ గా రికార్డులను దక్కించుకున్నారు. 67 సెంటీమీటర్ల ఖగేంద్ర రికార్డును 59.93 సెంటీమీటర్లతో ఫిలిప్పైన్స్కు చెందిన జున్రీ గత ఏడాది కొల్లగొట్టాడు. ఖగేంద్ర, జున్రీ వీళ్లంతా 16 ఏళ్ల వయస్సును పూర్తి చేసుకోగానే ఈ రికార్డును అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో వ్యక్తి చేరాడు.. అతడే నేపాల్ కు చెందిన చంద్ర బహదూర్ డాంగీ.. ఫిబ్రవరి 26న వరల్డ్ షార్టెస్ట్ మ్యాన్ రికార్డును అందుకున్నాడు చంద్ర బహదూర్. అయితే.. ఇతనికి పైన చెప్పుకున్న వ్యక్తుల్లా వయస్సు 16 కాదు.. ఏకంగా 72. అవును, అత్యంత లేటు వయస్సులో ఈ రికార్డును అందుకున్నాడు. నేపాల్ కొండప్రాంతాల్లో ఉండే చంద్ర బహదూర్ కు అసలు ఇలాంటి రికార్డు ఒకటుంటుందన్న సంగతి కూడా తెలియదు. నేపాల్ కు చెందిన ఖగేంద్రకు గిన్నీస్ రికార్డు అందడంతో.. స్థానిక పేపర్లు చంద్ర విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఆనోటా ఈనోటా ఈ విషయాన్ని తెలుసుకున్న గిన్నీస్ బుక్.. నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో అన్ని పరీక్షలు నిర్వహించి.. ప్రపంచంలో ఇంతవరకూ బతికున్న వారిలో అతి పొట్టి వ్యక్తి చంద్ర బహదూర్ డాంగినే అని తేల్చేసింది. ఇంతకీ.. చంద్రబహదూర్ ఎత్తు ఎంతో తెలుసా... కేవలం.. 54.60 సెంటీమీటర్లు. అందుకే.. లేటుగా వచ్చినా.. లేటెస్ట్ రికార్డుతో వచ్చాడు..