|

చెత్తగా ఆడారు.. చేజేతులా ఓడారు

తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ధోనీ సేన చేతులెత్తేసింది. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో భారత బ్యాట్స్ మెన్ వైఫల్యంతో 87 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముక్కోణపు సిరీస్ లో ఫైనల్ చేరడానికి ఈ మ్యాచ్ లో గెలవడం తప్పని సరి. బౌలింగ్ కట్టుదిట్టంగా చేసి, ఆసీస్ ను కట్టడి చేసినా, బ్యాట్స్ మెన్ మాత్రం యదావిధిగా నిర్లక్ష్యంగా ఆడి పరాజయం బాట పట్టించారు. ఆసీస్ తరపున ముగ్గురు బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీలు చేస్తే, భారత్ తరపున ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరలేదు.స్పిన్నర్ అశ్విన్ చేసిన 26 పరుగులే మన తరపున అత్యధిక స్కోరు. సెహ్వాగ్,సచిన్,గంభీర్, కోహ్లి,రైనా, ధోనీ ఎవరూ కూడా క్రీజ్ లో కుదురుకోలేకపోవడంతో భారత్ 39.3 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొత్తం టీమ్ ప్రక్షాళన చేస్తే తప్ప.. మన వాళ్లలో మార్పు రాకపోవచ్చు..

Posted by mla mana on 4:27 PM. Filed under , , , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

1 వ్యాఖ్యలు for "చెత్తగా ఆడారు.. చేజేతులా ఓడారు"

  1. భారత జట్టుకు నిరుపయోగతారల బరువు ఒక జబ్బులా పరిణమించింది.
    వారు జట్టును శాసించటానికి ఇష్టపడతారు. కష్టపడి ఆడటానికి ఇష్టపడరు.
    వారి ఘనచరిత్రలు తలచుకుంటూ జనం మురవాలసిందే.
    వారి ప్రస్తుత ఆట తీరును చూసి కాదు.
    శోచనీయమైన విషయం యేమిటంటే వారిని వేలెత్తి చూపటానికి బి.సి.సి.ఐ. కూడా భయపడుతుంది. దాంతో వారు నిర్భయంగా చెత్తగా ఆడుతున్నారు.
    ఒకాయన సాక్షాత్తు దైవస్వరూపుడట - ఆడటానికి అవస్థపడుతున్నా, జైజై అంటూ ఉండాలట.
    ఒకాయన మహావీరుడట - బంతులు + పరుగులు < 10 అయినా తప్పనిసరి వీరుడట.
    ఒకాయన రెండేళ్ళ క్రిందట గొప్పగా ఆడాడట - అది చాలదా అని అనుకోవాలట.
    ఇలా చాలా వ్రాయవచ్చును.
    ఆట కంటే ఆట గాళ్ళు ముఖ్యులు అయిన మన వాళ్ళ ఆటను యెందుకు మన సమయం దండగ చేసుకొని చూడటం?

Leave a reply

మరిన్ని పోస్టులు

Labels

మీ ఎమ్మెల్యే గురించి పూర్తి వివరాలు
తెలుసుకోవడం కోసం కింద లిస్టులోనుంచి
మీ జిల్లాను ఎంచుకోండి


Recently Added

Recently Commented