4:40 PM | Posted by mla mana

అత్యంత కీలకమైన మ్యాచ్ లో భారత జట్టు అత్యద్భుతమైన ప్రదర్శన చేసింది. శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారీ టార్గెట్ ను సునాయాసంగా ఛేదించి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. శ్రీలంకను అతి తక్కువ స్కోర్ కు కట్టడి చేయాలన్న ఆలోచన, టాస్ గెలిచినా భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అయితే.. భారత బౌలర్ల వైఫల్యంతో లంక 320 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. దిల్షాన్ 160 పరుగులు, సంగర్కర 105 పరుగులు చేశారు. 321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బోనస్ తో సహా మొత్తం 5 పాయింట్లను సంపాదించింది. విధ్వంసకర బ్యాటింగ్ తో అలరించిన కోహ్లీ, కేవలం 86 బంతుల్లోనే 133 పరుగులు చేసి.. భారత్ కు ఘన విజయాన్ని అందించాడు. సెహ్వాగ్ 16 బంతుల్లో 30 పరుగులు, సచిన్ 30 బంతుల్లో 39 పరుగులు, గంభీర్ 64 బంతుల్లో 63 పరుగులు, రైనా 24 బంతుల్లో 40 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మలింగ అత్యధిక పరుగులను సమర్పించుకున్నాడు. 7.4 ఓవర్లలోనే 96 పరుగులు సమర్పించుకున్నాడు.. తర్వాతి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక ఓడిపోతేనే మనకు విజయావకాశాలుంటాయి. శ్రీలంక గెలిస్తే మాత్రం.. మనం ఇంటికి తిరిగి రావాల్సిందే..